బ్రిటీష్ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మూవీ ‘డెవిల్’
వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయాలనుకునే యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోన్న డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్‌రామ్ 21వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్‌లైన్. డెవిల్ అనే టైటిల్ కథానాయకుడి పాత్రలోని పవర్‌ను తెలియజేసేలా ఉంది. దేవాంశ్ నామా సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై అందరిలో క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడు ఈ అంచనాలను మరింత పెంచుతూ చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు(జూలై5) సందర్భంగా సోమవారంరోజున విడుదల చేశారు. ఈ లుక్ చూస్తుంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. పంచెకట్టులో కళ్యాణ్‌రామ్ కోటు ధరించాడు. అంతే కాకుండా ట్రెయిన్ నుంచి బయటకు వస్తూ చేతిలో తుపాకీ పట్టుకుని ఎవరో కాలుస్తున్నాడు. తలపై గాయమైంది, గడ్డం, మెలి తిరిగిన మీసాలతో చూపుల్లో ఓ ఇన్‌టెన్స్ కనపిస్తోంది. ఈ లుక్ చూస్తుంటే నిజంగానే కళ్యాణ్‌రామ్ డెవిల్‌లా కనిపిస్తున్నారు. ట్రెయిన్‌పై చాలా మంది భారతీయులు కూర్చుని ఉన్నారు.
మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు, 1945 బ్రిటీష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సిలో బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంది. ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని ఛేదించడానికి నియమించబడ్డ రహస్య గూఢచారే డెవిల్. ఈ రహస్యం అతను ఊహించిన దాని కంటే మరింత లోతుగా ఉంటుంది. ఈ ప్రయాణంలో అతను ప్రేమ, మోసం, ద్రోహం అనే వలయాల్లో ఎలా చిక్కుకున్నాడు. ఈ మిస్టరీ కథానాయకుడి జయాపజయాలపై తీవ్ర పరిణామాలను చూపేలా ఉంటుంది. చరిత్ర గతిని మార్చేంత సామర్థాన్ని కలిగి ఉంటుంది.
పుష్ప చిత్రానికి రైటర్‌గా పనిచేసిన శ్రీకాంత్ విస్సాడెవిల్ చిత్రానికి కథను అందించారు. హర్ష్‌వర్ధన్ రామేశ్వర్ మోషన్ పోస్టర్‌కు నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇందులో అసాధారణమైన బ్రిటీష్ ఏజెంట్ పాత్రధారిగా, ఇప్పటి వరకు చేయనటువంటి రోల్‌లో కళ్యాణ్‌రామ్ కనిపించనున్నారు.
తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో పాన్ ఇండియా మూవీగా డెవిల్ సినిమా రూపొందనుంది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.