శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (12:57 IST)

సామ్రాట్ ప్యాంటులో ఎండుచేప వేసిన నందిని-బిగ్ బాస్-2లోకి కమల్ హాసన్?

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షోలో ఆసక్తికరమైన టాస్క్‌ల పరంపర కొనసాగుతోంది. టాస్క్‌లోని నిబంధనల్ని కౌశల్ ఇంటి సభ్యులకు చదివి వినిపించాడు. గంట మోగిన సమయం నుంచి సర్వైవర్స్ టీమ

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షోలో ఆసక్తికరమైన టాస్క్‌ల పరంపర కొనసాగుతోంది. టాస్క్‌లోని నిబంధనల్ని కౌశల్ ఇంటి సభ్యులకు చదివి వినిపించాడు. గంట మోగిన సమయం నుంచి సర్వైవర్స్ టీమ్ ప్లాన్క్స్‌పై కూర్చోవాలి. పైరేట్ టీం వారిని కిందకు దించేలా ప్రయత్నించాలి. అడుగు కింద పెడితే ఆ సర్వైవర్ అవుట్ అయిపోయినట్లే. 
 
ఈ టాస్క్‌లో భాగంగా నందిని సామ్రాట్ వద్దకు వెళ్లి చిలిపిగా ప్రవర్తించింది. అతడి శరీరంపై ఎండు చేపని వేసింది. ఎండు చేపతో అతడి చెవిలోకి పొనిచ్చింది. షర్ట్ లోపల వీపుపై ఎండు చేప వేయడానికి నందిని ప్రయత్నించగా.. అక్కడే గోకు బాగా అంటూ సామ్రాట్ ప్రోత్సహించాడు. బుట్టలో ఉన్న ఎండు చేపని తీసుకుని సామ్రాట్ ప్యాంటు కింది భాగం నుంచి లోపల వేయడానికి కూడా నందిని ప్రయత్నించింది. 
 
ఇలా టాస్క్‌లతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్‌-2 తెలుగు హౌస్‌లోకి ప్రత్యేక అతిథి రానున్నారు. బిగ్ బాస్ హౌస్‌ తమిళ హోస్ట్ కమల్ హాసన్, తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్నారు. ఇంట్లోని పోటీదారులతో కాసేపు గడపనున్నారు. తన నూతన చిత్రం ''విశ్వరూపం 2'' ప్రమోషన్‌లో భాగంగా ఆయన హౌస్‌లోకి ఎంటర్ అవుతారని సమాచారం.
 
ప్రపంచ నాయకుడిగా.. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన కమల్ హాసన్ తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎలా సందడి చేస్తారో వేచి చూడాలి. కమల్ ఎంట్రీ ఇచ్చే బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ తప్పకుండా అదిరిపోతుందని.. రేటింగ్ అమాంతం పెరిగిపోక తప్పదని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు. ఎందుకంటే..? కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే ఇందుకు కారణమని వారు చెప్తున్నారు.