శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (17:29 IST)

కంగనా రనౌత్ ఒక్క పాటలో బాలీవుడ్‌ను ఏకిపారేసింది.. వీడియో చూడండి

బాలీవుడ్ సినిమా రంగంలో పురుషాధిక్యత ఎక్కువని, హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని పదే పదే మొత్తుకుంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఏమాత్రం వెనుకాడని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, తాజాగా ఆ సినీ రంగంలో ఉ

బాలీవుడ్ సినిమా రంగంలో పురుషాధిక్యత ఎక్కువని, హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని పదే పదే మొత్తుకుంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఏమాత్రం వెనుకాడని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, తాజాగా ఆ సినీ రంగంలో ఉన్న లోటుపాట్లపై పాట ద్వారా సెటైర్లు విసిరింది. 
 
ఇటీవ‌ల ''ఆప్ కీ అదాల‌త్‌'' కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన కంగనా రనౌత్.. హిందీ సినిమాల విధివిధానాల గురించి తెలియజేసే ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బాలీవుడ్ నటులకు ఇచ్చే మర్యాద, హీరోయిన్లను వారెలా ట్రీట్ చేస్తారు వంటి అంశాలను వ్యంగ్యంగా చూపెట్టింది. ఏఐబీ కామెడీ గ్రూప్ స‌హాయంతో ఆమె ఈ వీడియో రూపొందించింది. 
 
ఇంకా ఈ వీడియోలో హీరోయిన్ సలహాలకు, హీరో సలహాలకు దర్శకుడు ఇచ్చే ప్రాధాన్యత ఎలా వుంటుంది. హీరోయిన్ వ్యక్తిగత జీవితంలో మీడియా చేసే  ఓవరాక్షన్, పారితోషికంలో చూపించే వివక్ష, ఐదు పదులైనా హీరోలతో టీనేజ్ హీరోయిన్లు నటించడం వంటి పలు అంశాలపై సెటైర్లు వేసింది. 
 
కెరీర్ అయిపోయిన హీరోయిన్లు మాత్రం సబ్బులు, డిటర్జెంట్లు, ఆహార పదార్థాల ప్రకటనలకు అంకితం కావడం.. ఎంత వయసొచ్చినా హీరోలు మాత్రం చిన్న వయస్సు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం వంటి అంశాలను ప్రస్తావించింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. సినీ రంగంలో వున్న నిజాలను కంగనా బోల్డ్‌గా బయటపెట్టిందంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.