కన్నడ చిత్ర పరిశ్రమను ఊపేస్తున్న నటి రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసు
డ్రగ్స్ మాఫియా కేసుకు సంబంధించి శాండిల్‌వుడ్ స్టార్, బహుభాషా నటి రాగిణి ద్వివేదికి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు శుక్రవారం రిలీజ్ సినిమా చూపించారు. కోర్టు సెర్చ్ వారెంట్‌తో ఉదయం ఒక్కసారిగా నటి రాగిణి ద్వివేది ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన సీసీబీ పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు.
ఇప్పటికే నటి రాగిణి ద్వివేది క్లోజ్ ఫ్రెండ్ రవిశంకర్‌ను అరెస్టు చేసిన సీసీబీ పోలీసులు అతను ఇచ్చిన సమాచారం మేరకు రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు చేస్తున్నారు.
గురువారం విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్న నటి రాగిణి ద్వివేదికి సీసీబీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు తరువాత అనేక మంది సెలబ్రిటీలకు చెమటలు పడుతున్నాయి.
బెంగళూరు సిటీలోని యలహంక సమీపంలోని జ్యూడీషియల్ లేఔట్ లోని అనన్యా అపార్ట్‌మెంట్స్‌లో ఫేమస్ నటి రాగిణి ద్వివేది నివాసం ఉంటున్నారు. శుక్రవారం బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనన్యా అపార్ట్‌మెంట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి నటి రాగిణి ద్వివేది నివాసం ఉంటున్న ఫ్లాట్ తలుపులు తట్టారు. తలుపులు తీసిన రాగిణి ద్వివేది కుటుంబ సభ్యులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను చూసి షాక్‌కు గురైనారు.
నటి రాగిణి ద్వివేది ఇంటిలోకి ప్రవేశించిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇంటిలో ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించారు. నటి రాగిణి ద్వివేది ఉపయోగిస్తున్న నాలుగు మొబైల్ ఫోన్లను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు మొబైల్స్ లోని కాల్ డేటాను సీసీబీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిసింది.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో నటి అనికాను ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నటి అనికా ఇచ్చిన సమాచారంతో శాండల్‌వుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులకు డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని ఎన్ సీబీ, బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో విచారణకు హాజరు కావాలని నటి రాగిణి ద్వివేదికి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే గురువారం నటి రాగిణి ద్వివేది పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు.
ప్రముఖ నటి రాగిణి ద్వివేది క్లోజ్ ఫ్రెండ్ రవిశంకర్‌ను విచారణ చేసిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం అతడిని అరెస్టు చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, సోమవారం విచారణకు హాజరౌతానని గురువారం నటి రాగిణి ద్వివేది ఆమె న్యాయవాదుల సహాయంతో బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నటి రాగిణి విచారణకు హాజరుకాకపోవడంతో బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అనుమానం మరింత ఎక్కువ అయ్యిందని తెలిసింది.
డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు న్యాయస్థానంను ఆశ్రయించారు. నటి రాగిణి ద్వివేది ఇంటిలో సోదాలు చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని సీసీబీ పోలీసులు కోర్టులో మనవి చేశారు. నటి రాగిణి ద్వివేది ఇంటిలో సోదాలు చెయ్యడానికి కోర్టు సెర్చ్ వారెంట్ జారీ చెయ్యడంతో శుక్రవారం ఉదయం సీసీబీ పోలీసులు ఆమె ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చారు.
బెంగళూరు నగరంలోని యలహంక సమీపంలోని జ్యుడీషియల్ లేఔట్ లోని అనన్యా అపార్ట్ మెంట్ లోని నటి రాగిణి ద్వివేది ఫ్లాట్‌లో సోదాలు చేస్తున్నామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేమని, విచారణ పూర్తి అయిన తరువాత అన్ని వివరాలు వెళ్లడిస్తామని బెంగళూరు సీసీబీ విభాగం జాయింట్ పోలీసు కమిసనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు.