సోమవారం, 10 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 10 మార్చి 2025 (12:50 IST)

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

karthi dubbing
karthi dubbing
కార్తి నటించిన సర్దార్ చిత్రం హిట్ అయిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్ గా సర్దార్ 2 రూపొందుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని నేడు ఏకాదశి సందర్భంగా కార్తి డబ్బింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో మాళవిక, ఆషిక రంగనాథ్, ఎస్‌జె సూర్య తదితరులు నటించారు. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన సినిమాను స్ లక్ష్మణ్ కుమార్ నిర్మించగా, వెంకటవ్మీడియా వెంకటేష్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు,
 
karthi dubbing pooja
karthi dubbing pooja
సర్దార్ 2 కి యువన్ శంకర్ రాజా సంగీతం, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించారు. విడుదల తేదీని ఇంకా నిర్మాతలు ప్రకటించలేదు.