బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (18:14 IST)

ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన చియాన్ విక్రమ్ తంగలాన్

Tangalan new
Tangalan new
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా "తంగలాన్" ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో "తంగలాన్" స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఆగస్టు 15న థియేటర్స్ లోకి వచ్చిన "తంగలాన్" చియాన్ విక్రమ్ కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ ను దాటింది. నెట్ ఫ్లిక్స్ లోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొందనుంది.
 
"తంగలాన్" చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. "తంగలాన్" సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.
 
నటీనటులు - చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు