ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (12:48 IST)

ప్రభాస్ సరసన మాళవిక మోహనన్.. టాలీవుడ్ ఎంట్రీపై హ్యాపీ

Prabhas-Malavika
మలయాళ నటి మాళవిక మోహనన్ ప్రభాస్ సరసన నటించనుంది. ప్రభాస్ రాబోయే చిత్రం ది రాజా సాబ్‌లో ప్రభాస్‍తో నటించడం ద్వారా ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం పట్ల థ్రిల్‌గా ఉందని చెప్పింది. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి సరైన ప్రాజెక్ట్ కోసం తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, ప్రభాస్‌తో కలిసి పనిచేయడం కంటే మంచి అవకాశం వస్తుందని ఆశించలేనని చెప్పింది. ఈ చిత్రాన్ని లైట్-హార్టెడ్ రోమ్-కామ్‌గా అభివర్ణించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.
 
సినిమా పరిశ్రమలో హీరోల పాత్రలతో పోల్చితే హీరోయిన్ల పాత్రలకు అంత కేరింగ్ ఉండదు. తనకు మాత్రం మంచి క్యారెక్టర్లే దొరకుతున్నాయి. 
 
గత సినిమాల్లోనూ దర్శకులు తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని మాళవిక వెల్లడించింది.