మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (17:22 IST)

కార్తిక్ రత్నం, సుప్యార్దే సింగ్ జంటగా లింగొచ్చా

Karthik Ratnam, Supyarde Singh
Karthik Ratnam, Supyarde Singh
కార్తిక్ రత్నం హీరోగా , స్టన్నింగ్ బ్యాూటి సుప్యర్ద సింగ్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం లింగోచ్చా.. ఆనంద్ బడా ని దర్శకుడి గా పరిచయం చేస్తూ శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యాదగిరి రాజు నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా అక్టొబర్ 27న విడుదల కానుంది. ఆ చిత్రానికి జె నీలిమ సమర్సిస్తుండగామల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా నిర్వహిస్తున్నారు. 
 
ఈ సందర్బంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ.. లింగోచ్చా గేమ్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్ లైన్ తో ఈ నెల 27 న ప్రేఓకుంల ముందుకు తీసుకువస్తున్నాం. నిర్మాత యాదగిరి రాజు గారు మాకు షూటింగ్ కి కావలసివి అన్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటి ఫిల్మ్ ని అందించారు. మా హీరో కార్తిక్ రత్నం నటుడుగా టాలీవుడ్ లో ప్రేక్షకుల హ్రుదయాల్లో స్థానం సంపాయించారు. హైదారాబాద్ కి సంభందించిన రొమాంటిక్ కామోడి విత్ లవ్ తో ఈ కథ నడుస్తుంది. హీరోయిన్ సుప్యర్ధ సింగ్ చాలా కాలం యువత కలల్లో వుండిపోతుంది. మా చిత్రానికి మ్యూజిక్ అందించిన బికాజ్ రాజ్ మంచి ట్యూన్స్ నే కాకుండా రీ రికార్డింగ్ సూపర్ గా చేశాడు.. ఈ చిత్రాన్ని ఇంత బాగా డిజైన్ చేసి మెయిన్ పిల్లర్ గా నిలిచిన అనిల్ కుమార్ తీగల గారికి ప్రత్యేఖం గా ధన్యవాదాలు.. పూర్తి లవ్ రొమాంటిక్ కామెడి తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.అని అన్నారు. 
 
నటీనటులు.. కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు నటించగా