సంబంధిత వార్తలు
- స్పైక్డ్ హెయిర్‌స్టైల్‌తో డబుల్ ఇస్మార్ట్ కోసం ఉస్తాద్ రామ్ పోతినేని
- రాజమౌళి సినిమాలో వేషం గురించి శ్రీసింహా ఏం చెప్పాడంటే!
- ప్రణీత్ కథ చెప్పినప్పుడు భయం వేసింది, ఆనందం కలిగింది : భాగే సాలే నిర్మాత అర్జున్ దాస్యన్
- డబ్బింగ్ జరుగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో రెండవ షెడ్యూల్ ప్రారంభం
- సినిమా అంతా పరిగెత్తడమే అందుకే భాగ్ సాలే టైటిల్ పెట్టాం: డైరెక్టర్ ప్రణీత్ బ్రాహ్మాండపల్లి
కీరవాణి కొడుకు శ్రీసింహా కోడూరి ఉస్తాద్ గా రాబోతున్నాడు
Srisimha Koduri
తాజాగా ఈ సినిమా నుంచి ఆకాశం అదిరే.. అనే వీడియో సాంగ్ రిలీజైంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ ఎనర్జిటిక్‌గా యూత్‌కు నచ్చేలా ఉంది. ఎవరైతే బైక్స్‌ను బాగా ఇష్టపడతారో వారందరికీ ఈ సాంగ్ నచ్చుతుంది. ఉస్తాద్ అనే తన బైక్‌ను ఇష్టపడే హీరో గురించి ఈ పాటలో చూపించారు. అతను బైక్ రైడ్ ఎలా నేర్చుకున్నాడు? అతని జీవితంలో ఉస్తాద్ అనే బైక్ ఎలాంటి పాత్రను పోషించిందనే విషయాలను చక్కగా ఎలివేట్ చేశారు. లక్ష్మీ ప్రియాంక రాసిన ఈ పాటను కాల భైరవ, ఆదిత్య శ్రీరామ్ పాడారు. వీరిద్దరి ఎనర్జిటిక్ వాయిస్‌కు అకీవా.బి అందించిన మ్యూజిక్ నెక్ట్స్ రేంజ్‌లో కనెక్ట్ అవుతుంది.
శ్రీసింహ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. డిఫరెంట్ మూవీస్, పరిమిత బడ్జెట్‌లతో రూపొందుతోన్న సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఉస్తాద్ నిర్మాతలు అదే నమ్మకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ, రవి శివ తేజ, సాయికిరణ్ ఏడిద కీలక పాత్రల్లో నటించారు. అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు.
