సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 5 జులై 2023 (15:53 IST)

రాజమౌళి సినిమాలో వేషం గురించి శ్రీసింహా ఏం చెప్పాడంటే!

kalabhairava- srisimha
kalabhairava- srisimha
ఎం.ఎం. కీరవాణి రెండో కొడుకు శ్రీసింహా. కథానాయకుడిగా మత్తు వదలరా, దొంగలున్నారు జాగ్రత్త, తెల్లవారితే గురువారం చిత్రాలు చేశాడు. అయితే చిన్నతనంలో బాలనటుడిగా యమదొంగలో వేషం వేశాడు. ఆ తర్వాత హీరోగా ఎదగాలని కలలుకన్నాడు. కానీ శ్రీసింహాకు హీరోగా ఎందుకనే అంత సక్సెస్‌ రాలేదు. తాజాగా భాగ్‌సాలే అనే సినిమా చేశాడు. ఇది ఓ రింగ్‌ నేపథ్యంలో సాగే కథ.
 
ఈ సినిమా దర్శకుడు కథ చెప్పినప్పుడు రాజమౌళిగారికి ఏమీ చెప్పలేదు. నాన్న కీరవాణిగారికి ఓ మాట చెప్పాను అంతే. నా సోదరుడు కాలభైరవ ఈ సినిమాకు ట్యూన్స్‌ ఇచ్చాడు. బాగా వచ్చాయి. హీరోగా నా స్ట్రగుల్‌ చూసి చాలామంది అనుకుంటుంటారు. రాజమౌళిగారి సినిమాలో ఏదైనా వేషం వేయవచ్చుగదా! అని కానీ నాకు అలా అడగడం ఇష్టం వుండదు. నటుడిగా నేనేంటో నిరూఇపంచుకున్నాకే అప్పుడు ఆలోచిస్తానంటూ వివరించారు. అయితే భాగ్‌సాలే సినిమా ట్రైలర్‌ చూశాక ఈ సినిమా హిట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రాజమౌళి కితాబిచ్చారట. అదే పెద్ద సక్సెస్‌గా భావిస్తున్నాడు శ్రీసింహా.