శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (14:37 IST)

నల్లచీరలో మెరిసిన మహానటి.. నానితో డ్యాన్స్ వీడియో వైరల్ (video)

Nani, Keerthy Suresh
నేచురల్ స్టార్ నానితో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తాజా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. 
 
దీనిలో ఆమె దసరాలోని 'చమ్‌కీలా ఏంజిలేసి' పాటకు డ్యాన్స్ చేయడం చూడవచ్చు. నాని హఠాత్తుగా కనిపించడం అందరినీ అలరించింది. కీర్తి సురేష్ నలుపు రంగు చీరలో చాలా అందంగా ఉంది.
 
ఇకపోతే.. దసరా సినిమాలో నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 30న సినిమా వెండితెరపైకి రానుంది.