చిరంజీవి వయసు 61 కాదట.. జస్ట్ 31... ఆ ఫోటోనే నిదర్శనమంటున్న ఫిల్మ్ నగర్!
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ కాలం తర్వాత తన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150"లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ కాలం తర్వాత తన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150"లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేసినపుడు.. చిరంజీవి పక్కన చిన్నపిల్లగా ఉంటుందనే విమర్శలు వచ్చాయి.
కానీ, ఈ ఫోటో చూసినవారెవరకీ అలా అనిపించదు. కాజల్ పక్కనున్న మెగాస్టార్ వయసు 61 అని కూడా ఎవరికీ గుర్తు రాదు. అంతలా మేకోవర్ సాధించగలిగారు చిరంజీవి. ఈ సినిమాలో డ్యాన్స్‌ల విషయంలో కూడా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. బన్నీ, ఎన్టీయార్, చరణ్ తరహాలోనే డ్యాన్స్‌లు వేస్తున్నారట. అయితే చిరు డ్యాన్స్‌లను, ఆయన స్టైల్‌ను చూసేందుకు సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే. ఇంతకీ చిరంజీవి ఇటీవల షష్టిపూర్తి చేసుకున్న విషయం తెల్సిందే.