శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (08:06 IST)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'ఖిలాడి' స్ట్రీమింగ్

రవితేజ, డింపుల్ హయాతీ జంటగా నటించిన చిత్రం "ఖిలాడి". రమేష్ వర్మ దర్శకత్వంలో దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, ఏ స్టూడియో పతాకంపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజ, డింపుల్, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి తదితరులు నటించారు. ఇటివలే థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఇపుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చిత్రంలో రవితేజ చూపించిన వేరియేషన్స్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి. రవితేజ స్టయిల్ మరింత స్పెషల్‌గా ఉండనుంది. ద్విపాత్రాభినయంలో రవితేజ కావాల్సినంత వినోదం పంచారు.