ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (18:23 IST)

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

Kiran Abbavaram
Kiran Abbavaram
హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్నారు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట. ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమా వివరాలు చెప్పబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
 
శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం.ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారట.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు.
 
ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న  కొత్త సినిమా సరికొత్త స్క్రీన్ ప్రెజెంటేషన్ తో హై క్వాలిటీ మేకింగ్ తో రూపొందుతోంది. కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ మూడు నాలుగు సినిమాలతో స్ట్రాంగ్ లైనప్ చేసుకున్నారు. ఇవన్నీ వేటికవి భిన్నంగా ఉంటూ కిరణ్ అబ్బవరంను సరికొత్తగా తెరపై చూపించనున్నాయి.