సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 మార్చి 2021 (19:12 IST)

పడుకుంటే ఆ హీరో పక్కన ఛాన్స్ కన్ఫర్మ్ చేస్తానన్నాడు, ఎవరు?

నటి షాలు షమ్ము. ఈమె ఎవరో టాలీవుడ్ ఇండస్ట్రీకి అంతగా తెలియదు. కానీ కోలీవుడ్ కుర్రకారు ఈమె పేరు చెబితే చిందులేస్తారు. అంతగా తెరపై రచ్చ చేస్తుంది. ఆమె ఇప్పుడిప్పుడే వర్థమాన నటిగా రాణిస్తోంది. ఇంతకీ ఆమె సంగతి ఇపుడెందుకు అంటారా? తన ఇన్‌స్టాగ్రాంలో అభిమానులతో మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీపై బాంబు పేల్చింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by (@shalushamu)

టాలీవుడ్‌కు చెందిన బిగ్‌హీరోతో పడుకుంటే ఛాన్స్ ఇస్తానని ఓ దర్శకుడు తనను సంప్రదించాడని బాంబ్ పేల్చింది. ఐతే దీనిపై కొందరు తారలు ఫిర్యాదు చేస్తున్నట్లు #MeToo అని మాత్రం కంప్లైంట్ ఇవ్వనని చెప్పింది. వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని చెప్పుకుంది.
 
టాలీవుడ్ టాప్ హీరోతో ఛాన్స్ వుందనీ, పడుకునేందుకు ఒప్పుకుంటే అంతా సిద్ధం చేస్తానని ఆయన చెప్పాడట. అలాంటివి నేను అంగీకరించను అనేసరికి ఆ ఛాన్స్ మిస్సయ్యిందని చెప్పుకొచ్చింది. ఇలాంటి డిమాండ్లు వుంటాయనీ, ఇది క్రేజీ ఫీల్డ్ కనుక తప్పదని అంది.
 
ఐతే వాటిని ఎదుర్కొని పైకి రావాలనీ, కాంప్రమైజ్ అయ్యేందుకు తను అంగీకరించకపోవడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని చెప్పింది. ఇంతకీ పడుకోమని అడిగిన దర్శకుడు ఎవరో పేరు చెప్పలేదు కానీ హీరో పేరు మాత్రం బయటపెట్టింది. మొత్తమ్మీద హీరో పేరును ఉపయోగించుకుని ఇలా కొందరు చేస్తున్నారా అనే సందేహాలు ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతున్నాయి.