సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 27 మార్చి 2017 (20:32 IST)

రజినీకాంత్ అల్లుడు ధనుష్ బండారం బయటపడుతుందని అలా చేశాడా? కోలీవుడ్ ఉత్కంఠ...

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ ను శని పట్టుకున్నాడా... అంటే అవుననే అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయనపై వరుసగా ఆరోపణలు, కేసులు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమధ్య గాయని సుచిత్ర ధనుష్ పైన సంచలనాత్మక ఆరోపణలు చేసి కోలీవుడ్ లో కుదుపుల

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ ను శని పట్టుకున్నాడా... అంటే అవుననే అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయనపై వరుసగా ఆరోపణలు, కేసులు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమధ్య గాయని సుచిత్ర ధనుష్ పైన సంచలనాత్మక ఆరోపణలు చేసి కోలీవుడ్‌లో కుదుపులు కుదిపింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ వుందో తెలియడంలేదన్నది మరో సంచలనం. అదలావుంటే ధనుష్ తమ కొడుకే అంటూ మధురై నుంచి వృద్ధ దంపతులు కేసు వేసిన సంగతి తెలిసిందే. 
 
వారు తమ పుత్రుడేనంటూ ఫోటోలను, పుట్టుమచ్చలను కోర్టుకు సమర్పించారు. ఈ నేపధ్యంలో మధురై కోర్టు అసలు ధనుష్ కు అక్కడ పుట్టుమచ్చలు వున్నాయో లేదో చెక్ చేయాలంటూ వైద్య బృందాన్ని ఆదేశించింది. ఈ మేరకు పరీక్షలు చేసిన వైద్య బృందం, ధనుష్ కు నిజంగానే అక్కడ పుట్టుమచ్చలు వున్నాయనీ, లేజర్ చికిత్స ద్వారా వాటిని తొలగించేశారంటూ నివేదికలో స్పష్టం చేశారు. 
 
వైద్యుల నివేదికపై విచారణ చేసిన కోర్టు కేసును ఏప్రిల్ నెల 11కు వాయిదా వేసింది. కాగా ధనుష్‌ తమ బిడ్డే అంటున్న కదిరేశన్‌, మీనాక్షి దంపతులు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. వాళ్లిచ్చిన ఆధారాల పుట్టుమచ్చలు ధనుష్ శరీరంపై వుండటంతో ఇప్పుడీ కేసు ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఐతే ధనుష్ మాత్రం వాళ్లెవరో తనకు తెలియదంటున్నారు. దీనితో వారిరువురూ డీఎన్ఎ టెస్టుకు సిద్ధమని చెపుతున్నారు. అందులో ఏం తేలుతుందో చూడాలి.