కొత్త బంగారు లోకం ''శ్వేతబసు''కు పెళ్లైపోయింది.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు
టాలీవుడ్‌లో కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయమైన అందాల బొమ్మ శ్వేతాబసు ప్రసాద్ పెళ్లికూతురైంది. శ్వేతబసు ప్రసాద్ వివాహం పూణేలో ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతబసు ప్రసాద్ వివాహం అట్టహాసంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.
బెంగాలీ సంప్రదాయం ప్రకారం శ్వేతబసు ప్రసాద్ వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో గులాబీ రంగు దుస్తులతో శ్వేతబసు ప్రసాద్ మెరిసిపోయింది. ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను శ్వేతాబసు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఆమె భర్త రోహిత్ కూడా.. ఇక అయిపోయింది.. అంటూ తన పెళ్లి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
కాగా మక్డీ సినిమా ద్వారా బాలనటిగా సినీ రంగంలోకి వచ్చిన శ్వేత.. ఈ సినిమా కోసం జాతీయ అవార్డును అందుకున్నారు. తెలుగులో కొత్త బంగారు లోకం, కళవర్ కింగ్ వంటి సినిమాల్లో మెరిసింది. అయితే ఆమెకు ఆశించిన స్థాయిలో హీరోయిన్ ఛాన్సులు రాలేదు. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతబసు ప్రసాద్ పలు సీరియల్స్‌లో నటించింది. బుల్లితెరకే పరిమితమై మంచి పేరు కొట్టేసిన శ్వేతబసు.. ఇక ప్రేమికుడినే పెళ్లాడింది.