సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (16:32 IST)

కరీనా, అలియా.. అందరూ కృతి సనన్‌ను చూసి నేర్చుకోవాలా?

Kriti sanon
Kriti sanon
బాలీవుడ్ తారలంటేనే ఇమేజ్ గుర్తుంటుంది. వారి ఇమేజ్ కారణంగా సినీ తారలు అట్టడుగు ఫ్యాన్సును పెద్దగా పట్టించుకోరు. ఫ్యాన్సుకు దూరంగా వుంటారు. హీరోలు, హీరోయిన్లు కూడా అంతే అనే చెప్పాలి. కరీనా కపూర్, అలియా భట్, ప్రియాంక చోప్రా వంటి నటీమణులు బిటౌన్‌లో అగ్రస్థానంలో వున్నారు. వీరు ఫ్యాన్స్‌ను పెద్దగా పట్టించుకోరనే చెప్పాలి. 
 
కానీ ఇందుకు భిన్నంగా కృతిసనన్ నిలిచింది. తన ఫ్యాన్ పట్ల కృతజ్ఞతతో వ్యవహరించింది. ఓ ఫ్యాన్ తనతో సెల్ఫీ తీసుకునేందుకు రాగా.. ఆ అభిమానిని దూరం పోండి అనకుండా వినయంగా పక్కనే నిల్చుని.. ఫోనులో సెల్ఫీ తీసి పెట్టింది. 
 
ఇంకా ఆ సెల్ఫీకి తర్వాత అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి కదిలింది. దీంతో ఆ అభిమాని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా అలియాభట్ వంటి అగ్ర హీరోయిన్లంతా కృతిసనన్‌ను చూసి నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.