బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (17:41 IST)

3 రోజుల్లో రూ.70.23 కోట్ల కలెక్షన్స్‌తో "ఖుషి" జోరు

khushi
టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా 70.23 కోట్ల రూపాయలు రాబట్టింది. 
 
యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఖుషి హల్చల్ చేస్తోంది. యూఎస్‌లో 1.38 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించింది. 2 మిలియన్ మార్క్‌కు ఖుషి పరుగులు పెడుతోంది. థియేటర్స్ డల్‌గా ఉండే సోమవారం కూడా ఖుషి నైజాం, ఏపీలోని అన్ని ఏరియాస్‌లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది. దీన్ని బట్టి ఈ వీక్ ఖుషికి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ఉండే అవకాశాలున్నాయి.
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరులో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి మూవీ సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఖుషికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.