మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (13:05 IST)

నటుడు 'లవకుశ' నాగరాజు ఇక లేరు

మహా నటుడు యన్టీఆర్, అంజలి దేవి నటించిన లవకుశ చిత్రం చూడని తెలుగువారు వుండరు. ఆ చిత్రంలో లవకుశులుగా అలరించిన బాల నటులు సుబ్రహ్మణ్యం, నాగరాజులు. వీరిలో కుశుడుగా నటించిన అనపర్తి నాగరాజు ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
 
71 సంవత్సరాల నాగరాజు గుండెపోటుతో హైదరాబాద్‌ లోని గాంధీనగర్‌లో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు వున్నారు. లవకుశ చిత్రం ద్వారా బాల నటుడిగా వెండితెరకు పరిచమయ్యారు.
 
ఇప్పటి వరకు తెలుగు, తమిళం భాషల్లో 340కు పైగా చిత్రాల్లో నటించారు. యన్టీర్ పౌరాణిక చిత్రాల్లో సుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో నటించారు.