సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (17:05 IST)

శేఖర్ కమ్ములకు పితృ వియోగం..

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి మృతి చెందారు. 89 ఏళ్ల శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
అయితే శేఖర్ కమ్ముల తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేట స్మశాన వాటికలో  అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా “లవ్ స్టోరీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే సంబందించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. ఈ సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.