రకుల్ ప్రీత్ సింగ్ వెంటడుతున్న టాలీవుడ్ దర్శకుడు??
టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇటీవలి కాలంలో ఈమెకు ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి. అయినప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తానువున్నట్టు గుర్తుచేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడుకు ఓ బిగ్ ఆఫర్ వరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. పవన్ - క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీలో రకుల్ ప్రీత్‌ను హీరోయిన్‌గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయిట. ఇందుకోసం రకుల్‌ను క్రిష్ సంప్రదించినట్టు తాజా సమాచారం.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ ఓ సినిమా రూపొందించబోతున్నారనీ, ఆ సినిమా కోసమే రకుల్‌ను క్రిష్ సంప్రదించి ఉంటారని ఫిల్మ్ నగరులో ప్రచారం జరుగుతోంది. అయితే పవన్-క్రిష్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు లేవని, ఆ లోపు ఓ వెబ్ సిరీస్ రూపొందించాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారని, దాని కోసమే రకుల్‌ను సంప్రదించారని తెలుస్తోంది. మరి, ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.