'సాహో' డైరెక్టర్ సుజిత్‌కు షాక్!! - వినయాక్‌కు 'మెగా' పిలుపు!?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. ఈ చిత్రం తర్వాత మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం దర్శకత్వం బాధ్యతలను 'సాహో' దర్శకుడు సుజిత్‌కు అప్పగించారు.
దీంతో నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్ర కథలో మార్పులు చేర్పులు చేసే పనిలో గత కొన్ని రోజులుగా నిమగ్నమయ్యారు. అయతే, సుజిత్ వర్క్ పట్ల మెగా కాంపౌండ్ పెద్దగా సంతృప్తి చెందలేదు. దీంతో దర్శకుడిని మార్చాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు దర్శకుల పేర్లను పరిశీలించారు. ఇలాంటి వారిలో సుకుమార్‌తో పాటు మరికొందరి పేర్లు కూడా ఉన్నాయి. ఇపుడు వివివినాయక్ పేరు వినిపిస్తోంది.
చిరంజీవి - వినాయక్ కాంబినేషన్‌లో 'ఠాగూర్', 'ఖైదీ నంబర్ 150' చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా తమిళ రీమేక్. పైగా, సూపర్ హిట్ సాధించాయి. దీంతో లూసిఫర్ చిత్రానికి వినాయక్ దర్శకుడు అయితే బాగుంటుందని చిరు భావించినట్టు టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఇదే న్యూస్ నిజమయే సంకేతాలు కనిపిస్తున్నట్టు ఫిలింనగరులో ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. చిరంజీవి త్వరలోనే 'లూసిఫర్' రీమేక్ బాధ్యతలను వివి వినాయక్‌కు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మెగాకాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.