శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (15:29 IST)

ట్రెండ్ అవుతున్న LGM ట్రైలర్..

lgm poster
భారత స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి సింగ్ ధోనీ తమ నిర్మాణ సంస్థ 'ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్' ద్వారా లెట్స్ గెట్ మ్యారీడ్-ఎల్‌జిఎమ్ అనే తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
రొమాంటిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే స్టార్ ఇవానా, నదియా, కమెడియన్ యోగి బాబు నటిస్తున్నారు. 
 
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. కామెడీగా రూపొందిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.