మంగళవారం, 18 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (12:55 IST)

లవ్ స్టోరీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?

Love story
లవ్ స్టోరీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య రొమాంటిక్ ఎంటర్టైనర్ "లవ్ స్టోరీ". ఇందులో చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజులుగా సెప్టెంబర్ 10న "లవ్ స్టోరీ"ని ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 10 న విడుదల అవుతుందంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
మేకర్స్ త్వరలో సినిమా ప్రమోషన్లను ప్రారంభిస్తారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. 
 
కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇది సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.