సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (18:29 IST)

నాగ‌చైత‌న్య‌ను వ‌ద్ద‌న్న అమీర్‌ఖాన్‌!

chaitu- Ameerkhan
అక్కినేని నాగ‌చైత‌న్య త‌న సినిమాల ప‌నిలో బిజీగా వున్నాడు. స‌మంత  అంత‌కుమించి బిజీగా వుంది. ఇక నాగ‌చైత‌న్య చేసిన సినిమా `ల‌వ్‌స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా క‌రోనా సెకండ్‌వేవ్‌కు ముందు విడుద‌ల‌కావాల్సివుంది. కానీ ఆ త‌ర్వాత థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో వాయిదా వేశారు. ఆ త‌ర్వాత ఓటీటీలో వ‌స్తున్న‌ట్ల వార్త‌లు వ‌చ్చాయి. దానిని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఖండించారు. ఆ త‌ర్వాత మ‌నం ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `థ్యాంక్యూ` సినిమా చేస్తున్నాడు. అదీ క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది. ఇక లాభంలేద‌ని బాలీవుడ్‌వైపు మ‌ళ్ళాడు. అక్క‌డా ఎదురుదెబ్బ‌త‌గిలింది.
 
నాగ‌చైత‌న్య బాలీవుడ్‌లో రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నాడ‌నేది తెలిసిందే. ఆయ‌న అమీర్‌ఖాన్ న‌టిస్తున్న `లాల్ సింగ్ చద్ద`లో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమాలో యాక్ష‌న్ సీన్ కూడా వుంది. దాన్ని  లడఖ్‌లోని కార్గిల్ ప్రాంతంలో నాగ‌చైత‌న్య‌తోనే చేయాలి. ఇక ఎలాగో లాక్‌డౌన్ కూడా ఎత్తేశారు క‌నుక అక్క‌డ చేయాల‌ని సిద్ధ‌మ‌వుతుండ‌గా అమీర్‌ఖాన్ వ‌ద్ద‌న్నాడ‌ట‌. ఇంకా పూర్తిగా క‌రోనా త‌గ్గ‌లేదు. ల‌డ‌క్ ప్రాంతానికి ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని వాయిదా వేసిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ చిత్రం `ఫారెస్ట్ గంప్`కు రీమేక్ ఇది. ముందుగా అనుకున్న‌ట్లు ఈ చిత్రం డిసెంబర్ 2021 లో విడుదల కావాలి.