శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (19:11 IST)

సిద్ శ్రీరామ్ స్వరంతో ఊర్వశివో రాక్షసివో నుండి లవ్లీ మెలోడీ

Allu Shirish, Anu Emmanuel
అల్లు శిరీష్, అను ఇమ్మన్యుల్ నటిస్తున్న "ఊర్వశివో రాక్షసివో" చిత్రంపై ఇదివరకే మంచి అంచనాలు నెలకొన్నాయి.రీసెంట్ గా రిలీజైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత బలపరించింది. ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నేడు ఫస్ట్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
 
"అనగా అనగనగా,కనులే కలగనగా,
నిజమై మెరుపై వాలేగా,  అనే లైన్స్ తో మొదలైన ఈ పాట మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. తన పాటలతో మిలియన్స్ వ్యూస్ ను దాటించే సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు.ఈ పాట కూడా ఒక లవ్లీ మెలోడీగా ఉండబోతుంది. అక్టోబర్ 10న "దీంతననా" అనే ఈ మొదటి పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రానికి అచ్చు రాజమణి  సంగీతం అందిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.