సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 20 మార్చి 2018 (18:56 IST)

స్టార్ హీరోలే ఆ భామ టార్గెట్..

స్టార్ హీరోలే ఆ భామ టార్గెట్ అన్నారు. ఇంత‌కీ ఆ భామ ఎవ‌రంటారా..? మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో ముకుంద సినిమాలో న‌టించిన పూజా హేగ్డే. నాగ చైత‌న్య‌తో క‌లిసి ఒక లైలా కోసం చిత్రంలో న‌టించింది. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివి

స్టార్ హీరోలే ఆ భామ టార్గెట్ అన్నారు. ఇంత‌కీ ఆ భామ ఎవ‌రంటారా..? మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో ముకుంద సినిమాలో న‌టించిన పూజా హేగ్డే. నాగ చైత‌న్య‌తో క‌లిసి ఒక లైలా కోసం చిత్రంలో న‌టించింది. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న సినిమాలో న‌టిస్తోంది. ఏప్రిల్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఎన్టీఆర్ సినిమాతో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాకి కూడా పూజా సైన్ చేసింది.
 
మ‌హేష్ బాబు 25వ చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించేందుకు పూజా హేగ్డేనే సెలెక్ట్ చేసారు. తాజాగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కొత్త సినిమాలో న‌టించే ఛాన్స్‌ను సొంతం చేసుకుంద‌ట‌. 
 
సాహో సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో సినిమా చేయ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని గోపీ కృష్ణ మూవీస్ బ్యాన‌ర్ పైన నిర్మించ‌నున్నారు. సాహో చిత్రం షూటింగ్‌ను దుబాయ్, అబుదాబి, రొమేనియాలో దాదాపు 50 రోజులు పాటు షూటింగ్ చేయ‌నున్నారు. బ‌న్నీ, ఎన్టీఆర్, మ‌హేష్, ప్ర‌భాస్… ఇలా స్టార్ హీరోలే త‌న టార్గెట్ అన్న‌ట్టుగా దూసుకెళుతోంది పూజా.