సంబంధిత వార్తలు
మోదికి సంతోషాన్ని కలిగించిన మాధవన్
Modi, madhav, Nambi
వివరాల్లోకి వెళితే, భారతదేశంలో గొప్ప స్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణన్. కానీ ఆయన జీవితంలో కొన్ని కుట్రలు జరిగాయి. అనేక అవమానాలకు ఆయన గురయ్యారు. అయినా ధైర్యంతో ముందుకు సాగారు. ఇప్పుడు ఆయన జీవితాన్ని సినిమాగా తీశారు. నంబియార్ పాత్రను మాధవన్ పోషించారు. ఆ సినిమా పేరు 'రాకెట్రీ`. నంబి నారాయణన్ గురించి పూర్తిగా స్టడీ చేసిన మాధవన్ ఆయనే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈమధ్యనే ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది. దీన్ని దేశంలో అన్ని భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి మోదీకి తెలిపి ఆయన సపోర్ట్ తీసుకోవాలని మాధవన్ చూశారు. అది ఇటీవలే నెరవేరింది. కొన్ని వారాల క్రితం సైంటిస్ట్ నంబి నారాయణన్ తో కలిసి మాధవన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సినిమా రూపకల్పన వెనుక ఉన్న విశేషాలను, వివరాలను మోదీకి తెలియచేశారు. మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ను చూపించారు. ఈ సందర్భంగా నంబి నారాయణన్ కు జరిగిన అన్యాయంపై మోదీ సానుభూతిని తెలిపారని మాధవన్ చెప్పారు. ఈ విషయాలన్నింటినీ మాధవన్ తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశాడు. ఆ వెంటనే మోదీ దానికి స్పందించారు.
తర్వాతి కథనం
