ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (19:27 IST)

భయం గుప్పెట్లో బాలీవుడ్ : మహారాష్ట్రలో లాక్డౌన్ తప్పదా?

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది. ప్రతి రోజూ 50 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి మహారాష్ట్రలో లాక్డౌన్ విధించారు. అంటే శుక్రవారం సాయంత్రం నుంచి నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు అన్ని బంద్. 
 
మరోవైపు సినిమా థియేటర్లు కూడా 50 శాతం ఆక్యుపెన్సీ తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దాంతో సినిమా ఇండస్ట్రీకి మరోసారి వేల కోట్ల నష్టం తప్పేదని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. దీంతో బాలీవుడ్ భయం గుగప్పెట్లో బతుకుంది. 
 
ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ నటీనటులు ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో కత్రినా కైఫ్, అలియా భట్, అక్షయ్ కుమార్, గోవిందా, భూమి పెడ్నేకర్, రణబీర్ కపూర్, అమీర్ ఖాన్ ఇలా అనేక మంది ఉన్నారు. 
 
దానికి తోడు ఇప్పుడు లాక్‌డౌన్‌ కూడా విధించడంతో కొత్త సినిమాల విడుదలకు మరోసారి ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ ధాటికి ఇండియన్ సినిమా విలవిలలాడి పోయింది.
 
భారతీయ సినీ పరిశ్రమలో సింహభాగం బాలీవుడ్ నుంచి వస్తుంది. అక్కడి సినిమాలు వేల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి. కానీ కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా బాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పదుల సంఖ్యలో భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 
 
సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమాల బిజినెస్ దాదాపు 1000 కోట్లకు పైగానే జరిగింది. కానీ కరోనా వైరస్ కారణంగా ఏడాదిగా బాక్స్‌లోనే ఉండిపోయాయి. భారత్‌లో కరోనా విలయతాండవం చేసే సరికి 8 నెలలు థియేటర్లను మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. 
 
ముఖ్యంగా మహారాష్ట్రలో రోజుకు 50 వేల కేసులు వస్తున్నాయి. దీంతో మ‌ళ్లీ వీకెండ్‌లో మహారాష్ట్రలో లాక్డౌన్ విధించారు.
ఏప్రిల్ 30న రావాల్సిన అక్షయ్ కుమార్ "సూర్య వంశీ" అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పటికి ఉన్న పరిస్థితులు చూసి తన సినిమా విడుదల తేది గురించి ఆలోచిద్దాం అంటున్నారు.