బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (11:05 IST)

మహేష్ బాబు ముఖ్యమంత్రి అయితే.. పోసానీ కృష్ణ మురళీ విపక్ష నేత?

స్పైడర్ సినిమాకు తర్వాత మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా... హైదరాబాద్‌లో సీఎం చాంబర్ సెట్‌లో చిత్రీ

స్పైడర్ సినిమాకు తర్వాత మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా... హైదరాబాద్‌లో సీఎం చాంబర్ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్‌తో పాటు ముఖ్య పాత్రధారులంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అసెంబ్లీ సీన్లను చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ సినిమాతోనే తెలుగు తెరకి కథానాయికగా కైరా అద్వానీ పరిచయమవుతోంది. కొరటాల-మహేశ్ కాంబినేషన్లో తొలుత శ్రీమంతుడు తెరకెక్కగా, రెండో సినిమాగా భరత్ అనే నేను రిలీజ్ కానుంది. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. తండ్రి మరణించడంతో ఆ స్థానంలో సీఎం అయిన యువకుని పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. అసెంబ్లీతో పాటు చాంబర్ సన్నివేశాల కోసం రూ.5కోట్ల ఖర్చుతో సెట్ వేశారు. ఈ సెట్లో తీసే సన్నివేశాలు సినిమాకు కీలకం కానున్నాయని సినీ యూనిట్ వెల్లడించింది. ఇక పోసానీ కృష్ణమురళీ ఈ చిత్రంలో విపక్ష నేతగా కనిపిస్తారట. 
 
పోసానీ, మహేష్‌ల మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయని.. ఫుల్ రొమాన్స్, యాక్షన్ చిత్రంగా ఈ సినిమా వుంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.