మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (13:27 IST)

తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా "భరత్ అనే నేను" 50 రోజుల వేడుకలు

డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించిన చిత్రం ' భరత్ అనే నేను ' 50 రోజుల వేడుకలను అభిమానులు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుప

డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించిన చిత్రం ' భరత్ అనే నేను ' 50  రోజుల వేడుకలను అభిమానులు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకున్నారు.
 
గుంటూరు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు కోట శేషగిరి ఆధ్వర్యంలో 'భరత్ అనే నేను' 50 రోజుల వేడుకలు పల్లవి థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధి చికాగో డాక్టర్ వాసిరెడ్డి శ్రీనాథ్ కేక్ కట్ చేయగా థియేటర్ మేనేజర్ రామిరెడ్డికి మెమెంటో అందజేశారు. థియేటర్ సిబ్బందికి వస్త్రాలను పంపిణి చేసారు. ఈ సందర్భంగా సీనియర్ అభిమాని బాపనయ్య సారధ్యంలో ప్రత్యేక తెరపై సూపర్ స్టార్ కృష్ణ మహేష్ పాటలను ప్రదర్శించారు. ముఖ్య అతిధులు డాక్టర్ శ్రీనాథ్, పిఆర్ఓ బాలాజీ శర్మలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అభిమాని జాలాది రవి, యస్కే బాజీ, కొండబోయిన శ్రీను, గుండా హరి, మాదాల నరేంద్ర, నెల్లూరు గాంధీ, అమీద్, డేవిడ్, రాజేంద్ర, ముక్కంటి తదితరు పాల్గొన్నారు.
 
విజయవాడ కపర్తి థియేటర్లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు చంటి ఆధ్వర్యంలో 'భరత్ అనే నేను' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి థియేటర్ నిర్వాహకులు శ్రీను బాబుకి 50 రోజుల షీల్డ్ అందజేశారు, బాణాసంచా కాల్చారు . ఈ కార్యక్రమంలో సాకేత్ వీరమాచనేని, ఇబ్రహీం, మహేష్, సూర్య, శివ తదితర అభిమానులు పాల్గొన్నారు 
 
వైజాగ్లో సిటీ వైడ్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ డైమండ్ పార్క్ ఆధ్వర్యంలో సంఘం శరత్ థియేటర్లో 'భరత్ అనే నేను' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు థియేటర్ మేనేజర్లు సుధాకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డిలు కేక్ కట్ చేయగా వారికి 50 రోజుల షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ నటించిన పాటలను అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బి అప్పల రాజిరెడ్డి, అధ్యక్షుడు వి సుబ్రహ్మణ్యం, గౌరవ కార్యదర్శి మద్ది రాజశేఖర్ రెడ్డి, బలివాడ ప్రవీణ్ కుమార్, కార్యదర్శి జీరు రమేష్ రెడ్డి, మహేష్, శ్రీకాంత్, మహేష్ బాబు, జనచైతన్య శ్రీనివాస్, కేబుల్ శీను, రామ్ సుభాష్, కాకి శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్, సంతోష్, కృష్ణ, రమేష్, రవితేజ తదితర అభిమానులు పాల్గొన్నారు. ఇంకా రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు కర్నాటకలోనూ సూపర్ స్టార్ కృష్ణ నటించిన భరత్ అనే నేను చిత్రం 50 రోజుల వేడుకలను జరుపుకున్నారు.