శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 20 జులై 2017 (08:58 IST)

ఐటెమ్ సాంగ్‌.. అనుష్క.. 2 కోట్ల రెమ్యునరేషన్.. నమ్మదగిందేనా

బాహుబలి -2లో మెరిసిపోయిన దేవసేన పాత్రధారి అనుష్క సినిమా అవకాశాలు లేక ఐటెమ్ సాంగ్ చేస్తున్నారా.. అదీ రెండు కోట్ల రూపాయలు తీసుకుని మహేష్ సినిమాలో పాటకు డ్యాన్స్ చే్స్తున్నారా.. ఎవరో ఒకరు అధికారికంగా నిర్దారిస్తే తప్ప ఇలాంటివి నమ్మశక్యంగా అనిపించవు. కా

బాహుబలి -2లో మెరిసిపోయిన దేవసేన పాత్రధారి అనుష్క సినిమా అవకాశాలు లేక ఐటెమ్ సాంగ్ చేస్తున్నారా.. అదీ రెండు కోట్ల రూపాయలు తీసుకుని మహేష్ సినిమాలో పాటకు డ్యాన్స్ చే్స్తున్నారా.. ఎవరో ఒకరు అధికారికంగా నిర్దారిస్తే తప్ప ఇలాంటివి  నమ్మశక్యంగా అనిపించవు. కాని సింగిల్ పాటకు అనుష్క రెండు కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలోస పీక్‌కి వెళ్లిపోయింది.
 
దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఒకరుగా విరాజిల్లుతున్న నటి అనుష్క.అయితే బాహుబలి–2 చిత్రం తరువాత ఆ సమయంలో అంగీకరించిన భాగమతి చిత్రం మినహా అమ్మడి చేతిలో చిత్రాలు లేవు. దీంతో అంతగా ప్రపంచ సినిమాయే తిరిగి చూసేలా చేసిన చిత్రం తరువాత అనుష్కకు అవకాశాలు రావడం లేదా అంటే వచ్చిన వాటిని అనుష్కనే అంగీకరించడం లేదనే సమాధానం చిత్ర వర్గాల నుంచి వస్తోంది. 
 
దీంతో ఈమె గురించి రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. అందులో ఒకటి పెళ్లి. అనుష్కకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, కుదిరితే త్వరలోనే అనుష్క ఇంట పీపీపీ..డుండుండుమ్మేననే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే అనుష్క ఇటీవల గుళ్లు, గోపురాలు అంటూ చుట్టేశారు. 
 
తాజాగా అనుష్క ఒక టాలీవుడ్‌ చిత్రంలో సింగిల్‌సాంగ్‌ చేయడానికి సమ్మతించినట్లు, అది మహేశ్‌బాబు హీరోగా నటించనున్న భారత్‌ అనే నేను చిత్రం అని ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. అంతే కాదు ఈ పాటలో మహేశ్‌బాబుతో లెగ్‌షేక్‌ చేయడానికి అక్షరాలా రూ.2 కోట్ల పారితోషికాన్ని పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అన్నది పక్కన పెడితే ఈ విషయమై సోషల్‌ మీడియాలో చాలా కాలంగా ప్రసారం సాగుతోంది. అయితే అసలు మహేశ్‌బాబు తాజా చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదన్నది గమనార్హం.