బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (12:50 IST)

'అజ్ఞాత‌వాసి' ఓ హాలీవుడ్ చిత్రం కాపీనా? కత్తి మ‌హేష్ ఏమంటున్నాడు

తెలుగు చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా కనిపిస్తున్నాడు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "అజ్ఞాతవాసి".

తెలుగు చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా కనిపిస్తున్నాడు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ప్రిరిలీజ్ ఫంక్షన్ 19వ తేదీన జరుగనుంది. జనవరి పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
'బిగ్‌బాస్' షోతో రెండు తెలుగు రాష్ట్రాల‌తోనూ పాపుల‌ర్ అయిన క‌త్తి మ‌హేష్.. ఆ త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మీద విమర్శ‌లు చేసి మ‌రింత పాపులారిటీ సంపాదించాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ అభిమానుల‌తో ఆయ‌న యుద్ధం చేస్తున్నాడు. ప‌వ‌న్ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నా ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డంలో మాత్రం ఆయ‌న వెన‌క‌డుగు వేయ‌డం లేదు.
 
అయితే, కత్తి మహేష్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా 'అజ్ఞాత‌వాసి' గురించి కూడా విమ‌ర్శ‌లు చేశాడు. ఈ చిత్రం ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వ‌చ్చేలా పోస్ట్ పెట్టాడు. 
 
2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'లార్జో వించ్' అనే సినిమా ట్రైల‌ర్‌ను త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి.. "ఎందుకైనా మంచిది.. ఈ సినిమాను బాగా చూసి గుర్తు పెట్టుకోండి" అంటూ ఓ కామెంట్ పెట్టాడు. దీనిపై అపుడే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.