శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (15:58 IST)

ఇక ఆలస్యమెందుకు ఉంగరాలు మార్చుకోమన్నారు... ఫ్రెండ్స్‌కు కూడా చెప్పలేదు : భావన

ఇరు కుటుంబాల వారు సమ్మతించడంతో.. ఇక ఆలస్యమెందుకు ఉంగరాలు మార్చుకోమని చెప్పడంతో ఆ క్షణమే ఉంగరాలు మార్చుకున్నట్టు సినీ నటి భావన చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపుల ఘటన తర్వాత ఉన్నట్టుండి నిశ్చితార్థం చేసుకు

ఇరు కుటుంబాల వారు సమ్మతించడంతో.. ఇక ఆలస్యమెందుకు ఉంగరాలు మార్చుకోమని చెప్పడంతో ఆ క్షణమే ఉంగరాలు మార్చుకున్నట్టు సినీ నటి భావన చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపుల ఘటన తర్వాత ఉన్నట్టుండి నిశ్చితార్థం చేసుకున్న భావన సోమవారం మీడియా ముందుకు వచ్చింది. 
 
అపుడు.. అత్యవసరంగా, రహస్యంగా రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నకు భావన సమాధానమిస్తూ, తన నిశ్చితార్థం విషయంలో రహస్యమేమీ లేదన్నారు. సంప్రదాయం ప్రకారం తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు నవీన్ కుటుంబ సభ్యులు వచ్చారని తెలిపారు. 
 
మా ఇద్దరి పెళ్ళికి పెద్దలు అంగీకరించిన తర్వా ఆలస్యమెందుకు? అని చెబుతూ ఉంగరాలు మార్చుకోండని అన్నారని, దీంతో తన నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిందని తెలిపింది. దీంతో తన నిశ్చితార్థానికి స్నేహితులను కూడా పిలవలేకపోయానని వాపోయింది. కాగా, ఆగస్టులో పెళ్లి జరుగుతుందని చెప్పారు.