శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (11:16 IST)

ఫేస్ మీద లిప్ చుట్టూ బ్యాండేజ్‌తో మంచు లక్ష్మి

Manchu Lakshmi
Manchu Lakshmi
నటి మంచు లక్ష్మి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఫేస్ మీద లిప్ చుట్టూ బ్యాండేజ్‌తో.. మంచు లక్ష్మి ఓ ఫోటోను షేర్ చేశారు.    ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో లక్ష్మి మంచు ఇలా చెప్పుకొచ్చారు. 
 
ఆమె ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు సాధారణ జ్వరం టాబ్లెట్ తీసుకుందట. అది వికటించి పెదవులు ఉబ్బిపోయి, కింది పెదవి కింద చర్మం మొత్తం రాష్ వచ్చిందట. 
 
ఇప్పుడు తగ్గిందట. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీలైనంత త్వరగా తన ఫ్రెండ్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నాను కాబట్టి.. రికవర్ అవుతున్నాను. లేదంటే బాడీ అంత ఎలెర్జి స్ప్రెడ్ అయ్యేది. ఎలెర్జి ఉందని తెలియక చిన్న పిల్స్ తీసుకుని చనిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారని చెప్పింది.