ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2024 (11:58 IST)

Manchu Manoj gets Emotional మా నాన్న దేవుడు : మీడియాకు తండ్రి తరపున మంచు మనోజ్ క్షమాపణలు

manchu manoj
Manchu Manoj gets Emotional  మీడియాపై సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన దాడిపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయన కుమారుడు మంచు మనోజ్ తన తండ్రి తరపున మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎపుడూ తోడుంటాని చెప్పారు. ఆయన బుధవారం హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ తన కోసం వచ్చిన మీడియా మిత్రులకు ఇలా జరగడం ఎంతో బాధగా ఉంది అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. 
 
'నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదు. సొంతకాళ్లపై పని చేసుకుంటున్నాను. ఈ వివాదంలోకి నా భార్య, ఏడు నెలల నా కుమార్తెను లాగుతున్నారు. నా భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడగలేదు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. 
 
ఆస్తి కోసం మా నాన్నతో గొడవపడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు. కానీ, ఈ రోజు చూస్తున్నది మా నాన్నను కాదా. ఇవాళ పోలీసుల విచారణకు హాజరువుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత సాయంత్రం మీడియాతో మాట్లాడుతాను' అని మంచు మనోజ్ అన్నారు.