మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 జులై 2017 (16:29 IST)

మంచు విష్ణుకు భుజం ఎముక ఫ్రాక్చర్... ఐసీయులో ట్రీట్మెంట్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తీవ్రంగా గాయపడ్డారు. 'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్‌ మలేషియాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా బైక్ ఛేజింగ్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తీవ్రంగా గాయపడ్డారు. 'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్‌ మలేషియాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా బైక్ ఛేజింగ్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొట్టడంతో మంచు విష్ణు బైక్ పై నుంచి కిందపడిపోయాడు. దీంతో తీవ్రగాయాలయ్యాయి. ఆ వెంటనే ఆయనను మలేషియాలోని పుత్రజయ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. 
 
ఈ ప్రమాదంలో మంచు విష్ణు భజం ఎముక ఫ్రాక్చర్ కాగా, మెడ భాగంలో కూడా తీవ్రమైన దెబ్బ తగినట్టు సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను మరొక ఆసుపత్రికి మార్చనున్నారు. ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని, ఆయన త్వరలోనే కోలుకుంటారని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆయన కోలుకునే వరకు షూటింగ్‌కు విరామమివ్వనున్నట్టు తెలుస్తోంది.