మీటూ వ్యవహారంలో మణిరత్నం.. కారణం ఎవరో తెలుసా? (video)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ వ్యవహారంలో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిక్కుకున్నారు. తమిళ దర్శకుడు మణిరత్నం.. తన కొత్త సినిమా విషయంలో తీసుకున్న ఓ నిర్ణయంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా మణిరత్నంపై విరుచుకుపడుతున్నారు. అయితే మణిరత్నం ఓ మహిళను వేధించి మీటూ ఇబ్బందిలో చిక్కుకోలేదు.
మణిరత్నం తన కొత్త సినిమా 'పొన్నియన్ సెల్వన్'కు తమిళ రచయిత వైరముత్తును ఎంచుకున్నాడట. అంతేకాదు ఆ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చేత 12 పాటలు రాయించారట. దీంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్లు మణిరత్నాన్ని ఏకిపారేస్తున్నారు.
తెలిసి తెలిసి ఎలా లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రచయితకు అవకాశం ఇస్తారంటూ ఫైర్ అవుతున్నారు. ఇంకా వైరముత్తును ఆ సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మణిరత్నంను మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డు గ్రహీత, ఏఆర్ రెహమాన్‌ను కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.