అసురన్ కోసం.. 40 ఏళ్ల హీరోయినా?
కొలవెరి సింగర్ ధనుష్ మారి-2తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ యంగ్ హీరో ధనుష్... కొత్త సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ''అసురన్'' పేరిట రూపుదిద్దుకునే ఓ సినిమాకు వెట్రి మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దాదాపు 40 హీరోయిన్‌ను ధనుష్ ఎంచుకున్నాడు.
సాధారణంగా హీరోలు తనకన్నా చిన్న వయసున్న వాళ్ళను లేదా తమతో సమానమైన వాళ్ళను హీరోయిన్లుగా ఎంచుకోవడానికి ఇష్టపడతారు. కానీ ధనుష్ మాత్రం ఇలా 40 ఏళ్ల వయసున్న మంజు వారియర్‌తో కలిసి నటిస్తుండటం విశేషం.
స్వతహాగా మంచి నటి అయిన మంజు వివాహం తరవాత చాలా ఏళ్ళు నటనకు దూరంగా ఉండి 2014లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ 'అసురన్' చిత్రాన్ని వెట్రి మారన్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇక మంజువారియర్ కన్యాకుమారిలో జన్మించింది. మలయాళంలో ''సాక్ష్యం'' సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది.