ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (17:03 IST)

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ VS13 అనౌన్స్‌మెంట్ ప్రీ-లుక్ రిలీజ్

VS13 Announcement Pre-Look
VS13 Announcement Pre-Look
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన 13వ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. దసరాతో భారీ బ్లాక్‌బస్టర్ అందించిన SLV సినిమాస్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెం. 8గా వస్తున్న ఈ చిత్రం గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో హై బడ్జెట్‌తో రూపొందనుంది. 
 
నూతన దర్శకుడు శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న #VS13 విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. విశ్వక్ పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ గా ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫైర్ బ్యాక్ డ్రాప్ లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీని క్రియేట్ చేసింది. 
 
ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. #VS13లో టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. తంగలాన్ ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహించనుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చనున్నారు.
 
ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.