సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2020 (19:59 IST)

మెగా అభిమానులకు మార్చిలో పండగే పండగ

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టేజీయస్ మూవీ ఆచార్య. ఈ సినిమాకి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 
 
ఇటీవల చిరంజీవి ఈ సినిమా టైటిల్ ఆచార్య అని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇంతకీ విషయం ఏంటంటే... ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం.. ఆ ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని బోనీకపూర్ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నివేథా థామస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు. 
 
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ప్రస్తుతం ఫస్ట్ సింగిల్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఈ పాటతో తమన్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. 
 
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సంచలన చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య అత్యంత  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. 
 
అయితే.. ఇప్పటివరకు ఈ సినిమాలోని ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల లుక్ రిలీజ్ చేయలేదు. మార్చి 27న రామ్ చరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా టైటిల్‌ని అఫిషియల్‌గా ఫంక్షన్ పెట్టి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్‌కి వెళ్లి అక్కడ మాట్లాడుతూ.. అనుకోకుండా ఈ మూవీ టైటిల్ ఆచార్య అని ఎనౌన్స్ చేసేసారు. 
 
అయితే... ఉగాది సందర్భంగా మార్చి 25న ఆచార్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇలా.. మార్చి నెలలో మెగాస్టార్ ఆచార్య ఫస్ట్ లుక్, పవర్ స్టార్ వకీల్ సాంగ్ ఫస్ట్ సాంగ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్‌కి ఈ మార్చి నెల పండగే అని చెప్పచ్చు.