శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (15:36 IST)

చిన్ని క్లిన్ కారా తో తొలి వినాయక చవితి జరుపుకున్న మెగా స్టార్ చిరంజీవి

chiru- charan fmily
chiru- charan fmily
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.  ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! అని మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అన్నారు. ఈ సారి ప్రత్యేకత ఏమంటే చిన్ని 'క్లిన్ కారా' తో  కలిసి తొలి వినాయక చవితి  జరుపుకోవడం. కొడుకు రామ్ చరణ్,  కోడలు ఉపాసన, మనవరాళ్లు తో సందడిగా పూజ జరుపుకున్నారు. 
 
chiru- charan fmily
chiru- charan fmily
వినాయకుని పూజ గదిని చూపిస్తూ, 21 పత్రాలతో పూజించిన వైనాన్ని తెలిపారు. తొలి వినాయక చవితి జరుపుకోవడం” ఆనందంగా ఉంది అంటూ ఎమోజిస్ పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. కొణిదెల ఇంటిలో ఒక దివ్యమైన వాతావరణం నెలకొంది అని ఈ ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
vinayaka pooja gadi
vinayaka pooja gadi
ఈ ఏడాది గేమ్ చేంజర్ సినిమా శంకర్ దర్శకత్యంలో రామ్ చరణ్ చేసున్నారు. ఇక చిరంజీవి సినిమాను అనిల్ రావిపూడి తో చేయనున్నారు.