ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (10:45 IST)

'బర్త్ డే సెలబ్రేషన్స్‌ ఆఫ్ మెగాస్టార్' ... హీరో సునీల్‌కు అవార్డు... ఏంటది?

మెగాస్టార్ చిరంజీవి 63వ పుట్టినరోజు వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. ఈ పుట్టినరోజుకు ఒక్క రోజు ముందుగా చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరిసింహా రెడ్డి టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసి మెగా అభిమాను

మెగాస్టార్ చిరంజీవి 63వ పుట్టినరోజు వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. ఈ పుట్టినరోజుకు ఒక్క రోజు ముందుగా చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరిసింహా రెడ్డి టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసి మెగా అభిమానులను ఖుషీ చేసింది.
 
ఆ తర్వాత మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో 'బర్త్ డే సెలబ్రేషన్స్‌ ఆఫ్ మెగాస్టార్' పేరిట ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి అభిమానులు భారీగా హాజ‌ర‌య్యారు. మెగా హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్‌తో పాటు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగా బ్రదర్ నాగేంద్ర బాబు, హీరో సునీల్, పరుచూరి బ్రదర్స్‌, ఉత్తేజ్ త‌దితరులు హాజ‌ర‌య్యారు. 
 
ఈ ఈవెంట్ పలు కార్యక్రమాలతో సంద‌డిగా మారింది. ముఖ్యంగా, ఈవెంట్‌లో బ‌న్నీ, చెర్రీ, వరుణ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఇదే కార్య‌క్ర‌మంలో అల్లు అర్జున్‌, అరవింద్‌లు కామెడీ హీరో సునీల్‌ని అల్లు రామ‌లింగ‌య్య అవార్డుతో స‌త్క‌రించారు.
 
మరోవైపు, చిరు బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా విడుద‌లైన సైరా టీజ‌ర్‌ని ముందుగా చూసింది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని చ‌ర‌ణ్ ఈ వేడుక‌లో వెల్లడించారు. 11.30ని.ల‌కు అఫీషియ‌ల్‌గా విడుద‌లైన టీజ‌ర్‌ని ప‌ద‌కొండు గంట‌ల‌కి ప‌వ‌న్ చూశార‌ని, టీజ‌ర్ అదిరిపోయిందని చెప్పార‌ని చెర్రీ చెప్పుకొచ్చారు. సినిమా కోసం ప‌వ‌న్ ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నార‌ని కూడా పేర్కొన్నారు.