సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 మే 2023 (19:48 IST)

మటన్‌ దావత్‌ లాంటి సినిమా మేమ్‌ ఫేమస్

memu famous team
memu famous team
35 మంది కొత్తవారితో ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిలింస్‌ బేనర్లో నిర్మించిన మేమ్‌ ఫేమస్ చిత్రం మటన్‌ దావత్‌ లా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తోంది. అందుకే థావత్‌ అనే ప్రోగ్రామ్‌తో ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించి టీజర్‌, రెండు పాటలను విలేఖరులకు ప్రదర్శించారు. 
 
నిర్మాతల్లో ఒకరైన శరత్‌ చంద్ర మాట్లాడుతూ, నిన్న రాత్రే ఫైనల్‌ అవుట్‌ పుట్‌ చూశాం. అందులో అందరితో కలిసి థావత్‌ చేసుకోవాలని ఈ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశాం. ఛాయ్‌బిస్కట్‌, లహరి ఫిలింస్‌తో అంతా కొత్వతారితో లాంఛ్‌ చేయడం ఆనందంగా వుంది. కొత్తవారిలో ఎనర్జీ ఏమిటో ఈ సినిమాలో చూస్తే మీకే తెలుస్తుంది. 2012లో నేను, అనురాగ్‌ జర్నీ మొదలు పెట్టాం. ఫస్ట్‌షో అనే మార్కెటింగ్‌ ఏజెన్సీ చేశాం. ఆలా 100 సినిమాలకు మార్కెటింగ్‌ చేశాం. ఈ క్రమంలో 2016లో ఛాయ్‌ బిస్కట్‌ మొదలుపెట్టాం. యూట్యూబ్‌ ప్రారంభించాం. 1500పైగా యూట్యూబ్‌ సినిమాలు చేశాం. వెబ్‌ సిరీస్‌ చేశాం. ఈ సినిమా జర్నీ చూస్తుంటే మాకే ఆశ్చర్యం కలిగింది. చాలామంది మాకు సపోర్ట్‌గా నిలిచారు. ‘మనం చేసిన మంచి ఎక్కడికి పోదనేది’ సినిమాలో డైలాగ్‌ వుంది. అదే మాకు వర్తిస్తుందని అనుకుంటున్నాం. ఈ సినిమా చూశాక అందరూ మజా చేస్తారని హామీ ఇస్తున్నాను. గీతా ఆర్ట్స్‌ రెండు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేస్తున్నారు. సరిగమ ద్వారా ఓవర్‌సీస్‌లో రిలీజ్‌ అవుతుంది. వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ విడుదల చేస్తున్నారు. ఈనెల 17వ తేదీన ట్రైలర్‌ లాంఛ్‌ జరపనున్నాం అని అన్నారు.
 
రచయిత, దర్శకుడు సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ, కొత్తవారిని ఎంకరేజ్‌ చేయడానికే ఛాయ్‌ బిస్కెట్‌ సంస్థను పెట్టారు. అందుకు ధైర్యం చేసిన నిర్మాతలకు ధ్యాంక్స్‌ చెపుతున్నా. అందరికీ నచ్చేలా అందరికీ కనెక్ట్‌ అయ్యేలా సినిమా వుంటుంది. ఫైనల్‌ కాపీ చూశాక చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమా ప్రమోషన్‌కు ప్రముఖ హీరోలంతా సహకరించడంతో నాకు మరింత పేరు వచ్చింది. వారి దగ్గరకు వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని రిసీవ్‌ చేసుకునేవిధానం కుటుంబాన్ని గుర్తు చేసింది. మంచి క్వాలీటీ కంటెంట్‌తో ఛాయ్‌ బిస్కెట్‌ సంస్థ సినిమాలు నిర్మిస్తోంది. ఒక ఊరిలో జరిగే కథ కాబట్టి అక్కడ వున్నట్లు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మాకు కాలేజీలో సీనియర్‌ అయిన శివను ఎంపిక చేశాం. నా ఫ్రెండ్‌ దుర్గను కాస్టిండ్‌ డైరెక్టర్‌గా పెట్టాను. అలా 30మందిని కథకు అనుగుణంగా కొత్తవారిని ఎంపికచేశాం. కళ్యాణ్‌ మంచి సంగీతం సమకూర్చారు. ‘పిల్లపిల్లోడు’ షార్ట్‌ ఫిలిం కూడా కళ్యాణ్‌ బాగా సంగీతం ఇచ్చారు. మేమ్‌ ఫేమస్‌లో 9మంది ఎనర్జిటిక్‌ సాంగ్స్‌ వున్నాయి. కళ్యాణ్‌ బీజియమ్‌ బాగా చేశాడు. సినిమా అంతా మటన్‌ దావత్‌ ఇచ్చినట్లుంటుంది అన్నారు.