బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:33 IST)

మైఖేల్‌తో శృతి బ్రేకప్ : ఒంటరి మార్గాల్లో నడవాల్సి వచ్చిందంటూ సందేశం

టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ ప్రేమాయణం విఫలమైంది. డేటింగ్‌లు, విహారయాత్రలతో వార్తలకెక్కిన శృతిహాసన్ ఇపుడు తన లండన్ ప్రియుడుతో బ్రేకప్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు మేకేల్ కోర్సెల్ అధికారికంగా ప్రకటించాడు. పైగా, బ్రేకప్ సందేశాన్ని కూడా వెల్లడించాడు. 
 
2016 సంవత్సరంలో మొదట స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రుతిహాసన్.. తరచుగా లండన్ వెళ్లి మైకేల్‌ని కలిసి వస్తూ ఉండేది. ఇక శృతిహాసన్ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు మైఖేల్‌ హాజరు కావడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో మైకేల్‌, శృతిహాసన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. 
 
తాజాగా వారిద్దరూ విడిపోయారు. తాము బ్రేకప్ చెప్పేశామని పేర్కొంటూ శృతి ప్రియుడు మైకేల్ సోషల్ మీడియా వేదికగా సందేశమిచ్చారు. "జీవితం మా ఇద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ ఈ యంగ్‌ లేడీ ఎప్పటికీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌గానే మిగిలిపోతుంది. ఆమెకు జీవితాంతం ఓ స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను" అంటూ తన సందేశంలో పేర్కొన్నాడు.