అభినవ్ చిత్ర పోస్టర్, ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.
dr. pooja, Konda Surekha, Bhimagani Sudhakar
డ్రగ్ మాఫియా విద్యార్థులను సైతం వడలడంలేదు. చిత్ర ట్రైలర్ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంది. గంజాయి మాఫియా మరియు డ్రగ్ మాఫియా కబంధ హస్తాల్లో ఇరుకున్న గిరిజన అనాధ బాల కార్మికులను, హైదరాబాద్ లోని ప్రముఖ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు యోగ మరియు ఆర్మీ శిక్షణ తీసుకొని గంజాయి మాఫియాను డ్రగ్ మాఫియాను ఎలా అంతం చేసారు అనే కధాంశంతో చిత్రం ఉంటుంది అన్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్. బాలల చిత్రం అయినా యాక్షన్ సన్నివేశాలతో బలమైన కధాంశంతో పూర్తిగా ఉత్కంఠ భరితంగా ఈ చిత్రం రూపొందించబడింది.
దీనికి కథ మాటలు పాటలు, నిర్మాత, దర్శకుడు డా. భీమగాని సుధాకర్ గౌడ్. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, ఎడిటర్ నందమూరి హరి. సారథి స్టూడియో సహకారంతో ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు నిర్మాత తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అతి త్వరలో నూన్ షో గా ధియేటర్లలో చిత్రం విడుదల చేయబోతున్నట్లు నిర్మాత, దర్శకుడు డా. భీమగాని సుధాకర్ గౌడ్ వెల్లడించారు.
