సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (10:23 IST)

నా భార్యే అలా పిలవడం లేదు : మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ జరిగిం

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ జరిగింది. 
 
ఇందులో బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ మాట్లాడుతూ, మోహన్ బాబును బావ అంటూ పిలిచింది. దీనిపై మోహన్ బాబు స్పందించారు. 'నన్ను బావా అని నా వైఫే ఎప్పుడూ పిలుస్తూ ఉంటుంది. ఈ మధ్య పిలవడం మానేసింది. ఎందుకంటే సక్సెస్ లేదు కదా..! సక్సెస్ లేకపోతే ఎవ్వరూ పిలవరు. నన్ను బావా అని పిలిచింది అనసూయ. రా.. షేక్ హ్యాండ్ ఇవ్వు అని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, తన గురించి అందరూ కంప్లయింట్స్ ఇవ్వడమే ప్రతిరోజు. అంటే ప్రతి రోజు, ప్రతి సినిమాలో ఎవరితో ఒకరితో గొడవ ఉంటూనే ఉంటుంది నాకు. కానీ ఈ సినిమాకి కంట్రోల్ చేసుకున్నా. ఎవర్నీ ఏమీ అనకూడదు భగవంతుడా అని రోజు ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని. ఎవరైనా సరే.. తప్పు చేస్తే చేశారు.. ఆ విజయ్ చూసుకుంటాడు. ప్రొడక్షన్ మేనేజర్స్ చూసుకుంటారు అని చాలా ఓపిగ్గా ఉన్నా అంటున్నారు.