దీపావళి సందర్భంగా పూజా హెగ్డేతో చిచ్చుబుడ్డి వెలిగించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్"
అఖిల్ అక్కినేని ఈమధ్యే మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని అడుగుతూ తన టీజర్‌ని అందరి అంచనాలు అందుకునేలా చేశాడు. ఇప్పుడు దీపావళికి చిచ్చుబుడ్డిని పూజాతో వెలిగించేసి అందర్ని ఆకట్టుకున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా మరో నిర్మాత వాసు వర్శతో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్.
ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌కి జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్ధే నటిస్తోంది. భలే భలే మగాడివోయ్, గీతాగొవిందం చిత్రాలకి సంగీతాన్ని అందించిన గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డేల మధ్య వున్న కెమిస్ట్రి ఈ దీపావళి పోస్టర్ తో తెలిసేలా బొమ్మరిల్లు భాస్కర్ తనదైన శైలిలో అఖిల్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఆకట్టుకునే రీతిలో డిజైన్ చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ఈ రోజు ఈ కలర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేసింది.
సంక్రాంతికి సిద్ధమవుతున్న రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రొమాంటిక్ ఫ్యామిలి ఎంటెర్టైనర్ సంక్రాంతి కానుకగా రానుంది. ఈ చిత్రంలో ఫ్యామిలి ఎమోషన్స్‌తో పాటు యూత్‌కి కావలసిన అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. చక్కటి మాటలతో పాటలతో ఆలోచించే కథతో ఆనందించే కథనంతో ఎక్కడా కాంప్రమైజ్ కాని ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఈ సంక్రాంతికి ఫ్యామిలి అంతా కలిసి చూసి ఆనందిచే చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్, బన్నివాసు, వాసు వర్మ, జిఏ2 పిక్చర్స్ కాంబినేషన్లో అందర్ని అలరించటానికి వస్తున్నారు. ఈ చిత్రంలో మురళి శర్మ, ఆమని, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను చాలా మంచి పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2021లో జనవరి సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీ నటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభయ్, అమిత్.
సాంకేతిక నిపుణులు.. బ్యానర్ : జీఏ2 పిక్చర్స్, సమర్పణ : అల్లు అరవింద్, మ్యూజిక్ : గోపీ సుందర్, సినిమాటోగ్రాఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ, ఎడిటర్ : మార్తండ్ కే వెంకటేశ్, ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా, పి ఆర్ ఒ - ఏలూరు శ్రీను, నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ, డైరెక్టర్ : బొమ్మరిల్లు భాస్కర్.