గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (09:50 IST)

కరోనా ప్రభావం, దీపావళి టపాసులపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు

కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న దీపావళిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని తెలిపింది.
 
శనివారం నాడు రాత్రి పూట కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు పేల్చుకోవాలని తెలిపింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాకాయలను కాల్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అవి కూడా పర్యావరణానికి మేలు కలిగించే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే పేల్చాలని తెలిపింది.
 
రాష్ట్రంలో కరోనా బాధితులు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్ననట్లు తెలిపింది. ఇక టపాకాయలు విక్రయించే షాపుల మధ్య దూరం తప్పనిసరి అని తెలిపింది. కొనుగోలుదార్లను కూడా 6 అడుగుల భౌతికదూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత షాపు యాజమాన్యానికి ఇచ్చింది. ఈ షాపుల వద్ద పేలుడు స్వభావం కలిగిన శానిటైజర్లను వాడరాదని స్పష్టం చేసింది.